
తమిళ స్టార్ హీరో 'దళపతి' విజయ్(Thalapathy Vijay) నటించిన సినిమా 'వారసుడు'. వంశీ పైడిపల్లి(Vamshi Paidipally) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలోని రంజితమే సాంగ్ మాస్ ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసేందే.
తాజాగా ఒక వివాహ వేడుకలో రంజితమే సాంగ్ కు ఓ చిన్నోడు చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ డ్యాన్స్ చూసిన రష్మిక(Rashmika) ట్విట్టర్ లో స్పందిస్తూ ' ఐ లవ్ దిస్.. ఈ వీడియో నాకెంతో నాకెంతో నచ్చింది. ఈ బుడ్డోడి డ్యాన్సుకు ఫిదా అయిపోయా' అంటూ ట్వీట్ చేసింది. ఈ వీడియో చూసిన రష్మిక ఫ్యాన్స్ రంజితమే సాంగ్ లో మీ డ్యాన్స్ సూపర్ అంటూ రిప్లే ఇస్తున్నారు.
ఈ మూవీ కి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వారసుడు(Vaarasudu) మూవీ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం రష్మిక పుష్ప 2(Pushpa2) మూవీతో పాటు రణబీర్ కపూర్(Ranbir Kapoor) యానిమల్(Animal) మూవీలో నటిస్తోంది.