నరుటోతో రష్మిక పెళ్లి.. ఫోటోతో క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

నరుటోతో రష్మిక పెళ్లి.. ఫోటోతో క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) పెళ్లి అతనితో ఎప్పుడో జరిగిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా రష్మికనే చెప్పుకొచ్చింది. అంతేకాదు దీనికి సంబందించిన ఫోటోను కూడా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమందేమో ఈ నరుటో(Naruto) ఎవరు అంటూ సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నరుటో అనే వ్యక్తి జపనీస్‌ వెబ్‌సిరీస్‌ ‘నరుటో’లో టైటిల్‌ రోల్‌ చేసిన హీరో. ఇక నరుటో వెబ్‌ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతపెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్మిక కూడా  ఈ సిరీస్‌ పెద్ద అభిమానట. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అంతేకాదు.. ఛాన్స్ వస్తే నరుటో పక్కన ప్రేయసిగా నటించాలనుందని కూడా తెలిపింది. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

ఇక రష్మిక చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్నా పుష్ప2(Pushpa2) లో నటిస్తోంది. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్(Ranbir kapoor) కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) డైరెక్షన్ లో వస్తున్న యానిమల్(Animal) సినిమాలలో కూడా నటిస్తోంది రష్మిక. ఈ సినిమా 2023 డిసెంబర్ లో రిలీజ్ కానుంది.