జొహనెస్‌బర్గ్: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. సఫారీ బోర్డు ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో తన పేరు లేకపోవడంతో గురువారం ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే డొమెస్టిక్ క్రికెట్‌లో లయన్స్ జట్టుకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. 2018లో జింబాబ్వేపై టీ20 మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన 37 ఏళ్ల డసెన్‌కు ఏడాది కాలంగా అవకాశాలు రావడం లేదు. కెరీర్‌లో 18 టెస్ట్‌లు ఆడిన డసెన్ 905 రన్స్ చేశాడు. 71 వన్డేల్లో 2657 రన్స్ సాధించాడు.
ఇందులో 6 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 57 టీ20ల్లో 1406 రన్స్ చేశాడు. ‘సౌతాఫ్రికా జెర్సీ ధరించడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. దేశం కోసం ఆడటం గర్వంగా అనిపిస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. లయన్స్ జట్టు తరఫున కొనసాగుతా. రాబోయే తరాలకు మెంటార్‌గా సేవలందిస్తా’ అని డసెన్ ఎక్స్‌లో పేర్కొన్నాడు. తన ఎదుగుదలకు సహకరించిన కోచ్‌లు, సహచర ఆటగాళ్లతో పాటు భార్య లారాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. స్టేడియంలో ఫ్యాన్స్ తనను ‘మాథౌజండ్’ అని పిలిచే పిలుపు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు. 2022లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన డసెన్‌ను ఆ తర్వాత జరిగిన వేలంలో ఎవరూ తీసుకోలేదు.
