
టైంకు బస్సులు రావడం లేదంటూ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో రాస్తారోకో చేశారు విద్యార్థులు. మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులు సరిగా నడపకపోవడంతో ఇబ్బందులు పడ్తున్నామన్నారు రాజాపేట, సింగారం విద్యార్థులు. తమ సమస్యలను యాదగిరిగుట్ట డీఎం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదని చెప్పారు. రాస్తారోకో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. టైంకు బస్సులు నడిచేలా చూస్తామని ఆర్టీసీ సిబ్బంది హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు విద్యార్థులు.