రేషన్ కార్డుదారులకు అలర్ట్.. జనవరి 31చివరి తేదీ

రేషన్ కార్డుదారులకు అలర్ట్.. జనవరి 31చివరి తేదీ

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.  రేషన్ కార్డుదారులు 2024 జనవరి 31వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  

రాష్ట్రవ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది.   దాదాపు 70 శాతం పూర్తి అయిందని అధికారులు తెలిపారు. మేడ్చల్ మాల్కజిగిరి జిల్లా 87.8 శాతంతో టాప్ లో ఉంది.  ఇంకా ఎవరైనా చేయనివారుంటే జనవరి 31లోపు కంప్లీట్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 

 కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్నారు. దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గురించిన కేంద్రం ఆధార్ నంబర్‌తో లింక్ (ఈ కేవైసీ) చేయాలని చెబుతోంది. 

ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించిన ప్రభుత్వం తాజాగా మరోసారి పొడిగించింది.  ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ కట్ అవుతుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది.    రేషన్ కార్డుతో ఆధార్ కార్డు సీడింగ్ చేసుకోని ఖాతాదారుల రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనుంది ప్రభుత్వం.