ఈ నెలలో రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిణీ వారం పొడిగింపు

ఈ నెలలో రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిణీ వారం పొడిగింపు

డీలర్లు ఐరిస్ కే ప్రయార్టీ ఇవ్వాలి: మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రేషన్​ పంపిణీని ఈ నెలలో వారం రోజుల పాటు పొడిగిస్తున్నామని, 22వ తేదీ వరకు రేషన్​ షాపులు ఓపెన్​ ఉంటాయని సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  గురువారం ఒక ప్రకటనలో  వెల్లడించారు. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హైకోర్టు ఆదేశాలకు తగ్గట్టు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిణీ చేపట్టాలని ఆఫీసర్లను ఆయన ఆదేశించారు. రేషన్​ పంపిణీలో ఐరిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కే ప్రాధాన్యం ఇవ్వాలని, ఐరిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పని చేయని వారికే మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటీపీ అమలు చేయాలన్నారు. ఒకవేళ మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుసంధానం లేని వారు లింక్ చేసుకోవాలని సూచించారు. ఈ నెలలో ఇప్పటి వరకు 60 శాతం రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిణీ  ఐరిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారానే జరిగిందన్నారు.  ఈ నెల 3 వరకే 11.33 లక్షల కార్డులకు రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిణీ జరిగిందని, ఇది జనవరి నెల కంటే 3 లక్షల కార్డులు ఎక్కువేనని వివరించారు. సాధారణంగా ప్రతి నెల 15 వరకు రేషన్​ పంపిణీ జరుగుతుంది. అయితే.. ఈ నెల నుంచి రేషన్​ పంపిణీకి ఐరిస్​ లేదా ఓటీపీని కంపల్సరీ చేయడంతో కోటా అందుతుందో లేదోనన్న ఆందోళనలో లబ్ధిదారులు ఉన్నారు. దీంతో మంత్రి స్పందిస్తూ.. రేషన్​ పంపిణీని మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

For More News..

మేయర్ పోస్టుకు పోటీచేయాలని మజ్లిస్‌కు టీఆర్ఎస్ ఆఫర్

మూడురోజుల్లో గుంతలు పూడ్చకుంటే జీతాల్లో కోత

రోజురోజుకూ దిగోస్తున్న బంగారం ధర