12 మందు బాటిళ్లు తాగేసిన ఎలుకలు

12  మందు బాటిళ్లు తాగేసిన ఎలుకలు

తాగుడుకు అలవాటుపడ్డవారు మందు కోసం ఏమైనా చేస్తారు. ఒక్కరోజు కూడా తాగకుండా ఉండలేరు. ఎవరి తాహతుకు తగ్గట్టు వారు లిక్కర్ కొనుగోలు చేస్తారు. ప్రతిరోజూ దేశంలో కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ సాగుతోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లిక్కర్ మీద వచ్చే రాబడి మీదనే ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా.. పాతాళానికి పంపే సత్తా ఒక్క మందుకే ఉంది. ఇటువంటి మందును ఎలుకలు కూడా వదలలేదు. ఏకంగా 1500 వందల రూపాయల విలువ చేసే 12 వైన్ బాటిళ్లను తాగేశాయి. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. 

నీలగిరి జిల్లాలోని గుడలూర్ సమీపంలోని కదంపూజాలో ప్రభుత్వం నడుపుతున్న టాస్మాక్ వైన్ షాపులో 12 వైన్ బాటిళ్లను ఎలుకలు ఖాళీ చేశాయి. లాక్‌డౌన్ వల్ల చాలాకాలం ఈ మద్యం దుకాణం మూసివేయబడింది. దాంతో షాపులో ఎలుకలు తిరగడం ప్రారంభించాయి. టాస్మాక్ ఉద్యోగులు సోమవారం చాలా రోజుల తర్వాత మద్యం దుకాణాన్ని తెరవడంతో  ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. షాపులో 12 క్వార్టర్ సీసాల మూతలు తెరిచినట్లు వారి దృష్టికి వచ్చింది. ఆ బాటిళ్ల మీద ఎలుకల యొక్క కాటు గుర్తులు ఉన్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. సిబ్బంది సమాచారం మేరకు టాస్మాక్ సీనియర్ అధికారులు దర్యాప్తు చేసి.. ఎలుకలే ఈ పని చేశాయని నిర్దారించారు.