
ముత్తారం, వెలుగు: ముత్తారం ఎస్సైగా రవికుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఎస్ఐ నరేశ్ భూపాలపల్లి(వీఆర్)కి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో భూపాలపల్లి(వీఆర్)లో ఉన్న రవికుమార్ ముత్తారం ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. రవికుమార్ కు పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు.
వేములవాడ రూరల్ పీఎస్‌కు..
వేములవాడరూరల్, వెలుగు: వేములవాడ రూరల్ ఎస్ఐగా చల్లా వెంకట్రాజం శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన అంజయ్య లాంగ్ లీవులో వెళ్లగా ఆయన స్థానంలో వేములవాడ టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న వెంకట్రాజంను ఇక్కడికి బదిలీ చేశారు.