రూ.100 కోట్ల క్రేజీ ప్రాజెక్ట్ నుండి రవితేజ ఔట్.. కన్ఫ్యూజన్లో ఫ్యాన్స్

రూ.100 కోట్ల క్రేజీ ప్రాజెక్ట్ నుండి రవితేజ ఔట్.. కన్ఫ్యూజన్లో ఫ్యాన్స్

మాస్ మహారాజ రవితేజ(raviteja).. టాలీవుడ్ లో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే.. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. అందుకే అనౌన్స్ మెంట్ నుండే ఆయన సినిమాలపై హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అలానే ఆయన తాజా సినిమాపై కూడా ఏర్పడింది. కారణం హిట్టు కాంబో రిపీట్ అవుతుండటమే. ఆ కాంబో మరేదో కాదు రవితేజ, గోపీచంద్ మలినేని. 

ఈ కాంబోలో ఇప్పటికే డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందులో క్రాక్ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక తాజాగా ఈ కాంబోలో RT4GM అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా మొదలైంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. రేపో మాపో షూటింగ్ కూడా మొదలవుతుంది అనుకున్నారంతా కానీ.. సడన్ గా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ సినిమా నుండి రవితేజ బయటకు వచ్చేశారని, ఆయన స్థానంలో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా చేయనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

దానికి కారణం రవితేజ రెమ్యునరేషన్ అనే తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు కు రూ.100 కోట్ల వరకు బడ్జెట్ కానుందట. ఆ రేంజ్ కలెక్షన్ రావాలంటే బడా హీరోతోనే వర్కౌట్ అవుతుందని భావించిన నిర్మాణ సంస్థ సన్నీ డియోల్‌ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.