డబుల్ ధమాకా షురూ చేస్తున్న రవితేజ.. శ్రీలీల?

డబుల్ ధమాకా షురూ చేస్తున్న రవితేజ.. శ్రీలీల?

మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) వరుస సినిమాలతో ఫామ్లో ఉన్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) తో మరో మూవీ చేయడానికి రెడీ అయిన విషయం తెలిసేందే. వీరి కాంబో అంటే ఫ్యాన్స్కు కిక్కేంచే వార్తా కావడంతో.. ఈ మూవీపై ఆసక్తి కలిగిస్తోంది. 

లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. RT 4 GM వర్కింగ్ టైటిల్తో వస్తోన్న ఈ మూవీలో..బ్యూటీ సెన్సేషన్  శ్రీలీల(Sreeleela) మరోసారి రవితేజతో జోడీ కట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ధమాకా జోడీ రిపీట్ అంటే..డబల్ ధమాఖా షురూ కన్ఫర్మ్ అయినట్టే అంటున్నారు మాస్ రాజా ఫ్యాన్స్. 

ధమాఖాలో వీరిద్దరి నుంచి వచ్చిన సాంగ్స్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసాయి. దీంతో RT 4 GM మూవీలో సాంగ్స్ ఎలా ఉంటాయనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ కు ఆసక్తి కలిగిస్తోంది. త్వరలో శ్రీలీలకు సంబంధించిన అప్డేట్ను మేకర్స్ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక  ఈ మూవీలో హీరోయిన్ శృతి హాసన్ కీ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. 

రీసెంట్గా రిలీజ్ చేసిన RT 4 GM పోస్టర్లో చుండూరు విలేజ్ పేరు ఉండటంతో..ఈ మూవీ కాన్సెప్ట్పై ఇంట్రెస్ట్ పెంచుతోంది. చుండూరు అంటే ఏపీ లోని ఒక గ్రామం. ఈ గ్రామంలో జరిగిన మారణహోమం ఇప్పటికీ మరిచిపోలేని అంశం. 1991 సం,లో అగ్రవర్ణాల కులాలకు చెందిన కొంత మంది, ఓ వర్గంపై  దాడి చేసి కర్రలతో, కత్తులతో వెంటాడి చంపినా తీరు చాలా అమానుషం. ఈ ఘటనలో మొత్తం 8 మంది మరణించారు. ఇక ఆ వర్గానికి చెందిన వారిని  కర్కశంగా నరికి ముక్కలు చేసి తుంగభద్ర నదిలో పడేశారు. 

దీంతో ఇదే స్టోరీపై మూవీ వస్తే కనుక, హిట్ అవ్వడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.