Raviteja : వినాయక చవితికి 'రవితేజ' మాస్ జాతర

Raviteja : వినాయక చవితికి 'రవితేజ' మాస్ జాతర

రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై  నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.  వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు గురువారం ప్రకటించారు. 

రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ గా వింటేజ్ వైబ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో  ఈ సినిమా రాబోతోందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.  థియేటర్లలో మాస్ పండుగ ఖాయం అని చెప్పారు.  రవితేజ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 75వ చిత్రం. శ్రీలీల హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.