
ఆసియా కప్ 2025లో ఇండియాకు అసలు పోటీ లేదని టీమిండియా మాజీ స్పిన్నర్ రాణి చంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. యుఎఇతో ఇండియా ప్రారంభ మ్యాచ్ కు ముందు తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ ప్రమాణాలు చాలా దారుణంగా ఉన్నాయని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇండియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు సన్నాహకంగా ఈ టోర్నీ సరిపోదని ఈ సీనియర్ స్పిన్నర్ అన్నాడు. టోర్నీలో పోటీతత్వం లేకపోవడంపై అశ్విన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
అశ్విన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " టోర్నమెంట్‌లో టీమిండియాకు అసలు పోటీ లేదు. ఈ టోర్నీలో పోటీతత్వం పెంచడానికి సౌతాఫ్రికా జట్టుకు చేర్చాల్సింది. అప్పుడు ఆసియా కప్ అని కాకుండా ఆఫ్రో-ఆసియా కప్‌గా మార్చాలి. భారత జట్టుకు పోటా ఉండాలంటే కనీసం ఇండియా-ఏ జట్టును చేర్చాలి. మేము బంగ్లాదేశ్ గురించి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వారితో మాట్లాడటానికి ఏమీ లేదు. ఈ జట్లు భారత్‌కు పోటీ ఇవ్వగలవా..?". ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో ఇండియా 170 పరుగుల టార్గెట్ సెట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ ఛేజ్ చేయడం అసాధ్యం.
టీ20లు థ్రిల్లింగ్‌గానే ఉంటాయి. కానీ ఆసియా కప్‌లో భారత్ ఏకపక్షంగా ఆడుతుంది. ఈ టోర్నీ 2026 టీ20 వరల్డ్ కప్ కు ప్రాక్టీస్ గా భావించడం సరికాదు. టీ20 వరల్డ్ కప్-2026కు ఆసియా కప్ కర్టన్‌రైజర్ కాదు. కేవలం కర్టెన్ మాత్రమే. టీమిండియాను 155 పరుగులకే కట్టడి చేసి.. పోరాడితే కష్టంగా ప్రత్యర్థి జట్టుకు విజయం దక్కే అవకాశాలు ఉన్నాయి". అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అశ్విన్ చెప్పినట్టే టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ లో భారీ విజయం సాధించింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో 57 పరుగులకే ఆలౌట్ చేసి టార్గెట్ ను కేవలం 4.3 ఓవర్లలో ఫినిష్ చేశారు.