అశ్విన్ను ఊరిస్తున్న నెం.1 రికార్డు

అశ్విన్ను ఊరిస్తున్న నెం.1 రికార్డు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన బౌలింగ్తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్న రవిచంద్రన్ అశ్విన్..ఈ సిరీస్లో ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 450 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. అయితే అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారత స్పిన్నర్గా అశ్విన్ నిలిచాడు.  ఈ క్రమంలో అనిల్ కుంబ్లే రికార్డును అతడు బ్రేక్ చేశాడు. తాజాగా మూడో టెస్టుకు ముందు అశ్విన్ మరో రికార్డుపై కన్నేశాడు. 

నాగ్‌పూర్, ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి రెండు టెస్టుల్లో అశ్విన్ 14 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ మరో  9 వికెట్లు పడగొడితే..ఈ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్‌లో అనిల్ కుంబ్లే (111) పేరిట ఉంది. ఇప్పటికే బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో 103 వికెట్లు దక్కించుకున్న అశ్విన్.. మరో 9 వికెట్లు పడగొట్టి అనిల్ కుంబ్లే నెం.1 రికార్డ్‌ని బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. 

ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టెస్టులో అశ్విన్ 8 వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్టులో 6 వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో తొలి టెస్టులో భారత్  ఇన్నింగ్స్, 132 పరుగుల తేడాతో గెలవగా..ఢిల్లీ టెస్టులో6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.