
గచ్చిబౌలి, వెలుగు : శేరిలింగంపల్లి సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మారబోయిన రవికుమార్ శుక్రవారం నామినేషన్ వేశారు. ఉదయం కొండాపూర్ పరిధి మజీద్ బండలోని తన ఆఫీసు నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, బీజేపీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి రవికుమార్ యాదవ్ ర్యాలీగా శేరిలింగంపల్లిలోని రిటర్నింగ్ ఆఫీసుకు వెళ్లారు.
రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డికి నామినేషన్ పేపర్లను అందజేశారు.