IND vs ENG 2025: ఇంగ్లాండ్ చీప్ ట్రిక్స్.. పరుగు తీస్తుంటే జడేజాను అడ్డుకున్న కార్స్

IND vs ENG 2025: ఇంగ్లాండ్ చీప్ ట్రిక్స్.. పరుగు తీస్తుంటే జడేజాను అడ్డుకున్న కార్స్

లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇండియా, ఇంగ్లాండ్ ప్లేయర్ల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, బ్రైడాన్ కార్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఐదో రోజు తొలి సెషన్ లో జడేజా సింగిల్ తీసే క్రమంలో జడేజా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ కార్స్ ను ఢీ కొట్టాడు. వెనక్కి చూస్తూ జడేజా పరిగెత్తడంతో కార్స్ భుజంను తగిలాడు. అయితే ఈ సమయంలో కార్స్ కావాలనే పరుగులు తీస్తున్న జడేజాను వెనక్కి లాగినట్టు స్పష్టంగా తెలుస్తుంది. 

Also Read:-సైనా నెహ్వాల్ విడాకులకి కొద్దిసేపటి ముందు, కశ్యప్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్.. మ్యాటరేంటంటే ?

కార్స్ ఉద్దేశ్యపూర్వకంగా చేసిన ఈ పని జడేజాకు నచ్చలేదు. ఇంగ్లాండ్ బౌలర్ పై సీరియస్ అయ్యాడు. జడేజా మాటలకు కార్స్ మీదకి దూసుకొచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దది కావడంతో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ వచ్చి వీరి వాగ్వాదాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ ఉద్రిక్తతను తగ్గించడానికి మైదానంలో ఉన్న అంపైర్లు కూడా జోక్యం చేసుకోవలసి వచ్చింది. నితీష్ కుమార్ తో జడేజా భాగస్వామ్యం నెలకొల్పుతున్న సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు భారత ఆటగాళ్ల ఏకాగ్రత చెడగొట్టడానికే ఈ పని చేశారని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే 193 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓటమి దిశగా పయనిస్తోంది. ఐదో రోజు లంచ్ సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (17) ఉన్నాడు. టీమిండియా గెలవాలంటే మరో 81 పరుగులు చేయాలి. మరోవైపు ఇంగ్లాండ్ విజయానికి రెండు వికెట్లు కావాలి. జడేజా అద్బుతంగా చేస్తే తప్ప ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి ఖాయంగా మారింది.