
మాస్ మహారాజా రవితేజ(Raviteja)..టాలీవుడ్లో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే..ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు.అందుకే అనౌన్స్ మెంట్ నుండే ఆయన సినిమాలపై హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.
అంతేకాకుండా ఆయన నుంచే వచ్చే సినిమాలన్నీ ఎక్కువగా కొత్త దర్శకులతో చేస్తుంటారు. అసలు ఒక స్టార్ హీరో న్యూ టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయడమంటే మామూలు విషయం కాదు.ఇదొక పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. అలాంటప్పుడే ఇండస్ట్రీలో మంచి అనే పదానికైనా..గ్రౌండ్ లెవల్ నుంచి వచ్చిన విషయాన్ని ఐనా..మరిచిపోలేని క్యారెక్టర్ అందరికీ కనిపిస్తోంది.
ఇదంతా ఇపుడు ఎందుకంటే..రవితేజ మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడు. శ్రీ విష్ణు నటించిన సామజవరగమన మూవీకి కథా రచయితగా పనిచేసిన భాను బోగవరపు చెప్పిన కథ రవితేజకి బాగా నచ్చేసిందట. ఇక అతడిని దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ తన 75వ సినిమా అనౌన్స్ చేసేశాడు. ఉగాదిని పురస్కరించుకొని రవితేజ ల్యాండ్‌మార్క్ మూవీపై స్పెషల్ గా ప్రకటించారు మేకర్స్.
ఊరి జాతరను చూపిస్తూ క్రియేటివిటీ తో డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో కళ్ళద్దాల మీద ‘RT 75’ అని రాయడం బాగుంది. అలాగే పోస్టర్ మీద “రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి” అని రాశి ఉంది.. అలాగే “హ్యాపీ ఉగాది రా భయ్” అని తెలంగాణ యాసలో రాసి ఉండటం గమనించవచ్చు.
Also Read :రేపటి నుంచి దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను
ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు “లక్ష్మణ భేరి” అని తెలిపిన మేకర్స్..సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. వచ్చే ఏడాది 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది.
రవితేజకు తొలి దర్శకులతో పనిచేయడం కొత్త కాదు,కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే అతనికి సంపూర్ణ విజయాన్ని అందించారు.రవితేజ కామెడీ జానర్ లో సినిమా చేస్తే మాత్రం అభిమానులు తప్పకుండా ఆదరిస్తారు.అందుకు ఉదాహరణగా చెప్పాలంటే..వెంకీ,కిక్,దుబాయ్ శీను వంటి బ్లాక్‌బస్టర్‌లు.ఈ సినిమాలో నుంచి వచ్చే మీమ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే.
అందరికి హ్యాపీ ఉగాది రా భయ్ ?
— Sithara Entertainments (@SitharaEnts) April 9, 2024
We are elated to announce our next with the ???? ???????? @RaviTeja_offl ~ #RT75, Shoot Begins Soon! ?
వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు... రెడీ అయిపొండ్రి ?
We promise to bring back the typical Mass Maharaja on Big screens… pic.twitter.com/W7Q2Jdn6zO