Trivikram Speech: రేపటి నుంచి దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను: త్రివిక్రమ్

Trivikram Speech: రేపటి నుంచి దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను: త్రివిక్రమ్

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square). దర్శకుడు మల్లిక్ రామ్(Mallik Ram) తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మార్చి 29న విడుదలై భారీ విజయాన్ని సాధించింది.

బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సినిమా సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక సినిమాలో టిల్లు పాత్రలో సిద్దు నటన నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. థియేటర్స్ లో టిల్లన్న మాస్ జాతారకు కలెక్షన్స్  మోత మోగిపోతోంది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్కు మాస్ గాడ్, మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్స్ గా వచ్చారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ.."అందరికీ నమస్కారం, ముందు సిద్దు 100 కోట్ల క్లబ్ లోకి వచ్చినందుకు వెల్కమ్. ఈ సినిమా టిల్లు స్క్వేర్ మాత్రమే కాదు రాధిక స్క్వేర్ కూడా. నాలుగు సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇంట్లో నాకు టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి నేను సిద్ధుని చూస్తున్నాను.

Also Read :సినిమా చేశాక ఇలా మాట్లాడుతావా.. జగపతిబాబుపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్

దీని కోసం అతను పడిన కష్టం కానీ టిల్లు డైరెక్ట్ చేసిన విమల్ కానీ ఈ సినిమా డైరెక్ట్ చేసిన మల్లిక్ కానీ వాళ్లు మొత్తం టిల్లు తప్ప ఇంకా ఏమీ పని లేనట్టుగా పనిచేశారు. అందుకే ఇంత పెద్ద సక్సెస్ కనిపిస్తోంది. వంశీ కానీ, చినబాబు కానీ వాళ్లు సిద్ధూని ఆ టీంని నమ్మారు. అందుకే టిల్లు స్క్వేర్ టిల్లు కంటే స్క్వేర్ ది హా హిట్ అయింది.

వచ్చే సంవత్సరం అంటే రేపటి నుంచి దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఇక అంతా నాకు తెలుసు, ఆయన మీద వెళ్ళిపోయేలా ఉంది. సో ఈ 100 పక్కన ఇంకో సున్నా పెట్టి ఆయన దేవర మొదలు పెట్టాలని మీ అందరి తరపున మనందరి తరపున ఎన్టీఆర్ ని కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తూ, ఈ టీం అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓవర్ టు దేవర అని అన్నారు.