
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన మూడో చిత్రం గుంటూరు కారం. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతి బాబు కీ రోల్ లో కనిపించారు. అయితే ఈ సినిమాపై జగపతి బాబు సంచలన వాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాను తాను పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. సినిమాలో కొన్ని పాత్రల్లో మార్పులు చేస్తే బాగుండేదని, క్యారెక్టరైజేషన్ ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడిందని అన్నారు. పాత్ర కోసం తాను చేయాల్సింది చేశానని చెప్పుకొచ్చారు. సినిమాను ముగించడం కొంచెం కష్టమైందని అన్నారు. మా ఇద్దరి కాంబోలో సినిమా వస్తే వృధా కాకుడదని అనుకుంటున్నానని.. మహేష్ తో చేసిన సినిమాలు ఎప్పటికి గుర్తుండిపోవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.
Also Read :బేసిగ్గా నేను నవ్వడం మొదలు పెడితే దాన్ని ఆపుకోవడం చాలా కష్టం..హాట్సాఫ్ సిద్దు
అయితే జగపతి బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జగ్గుభాయ్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమా చేసేముందు ఈ విషయాలు ఆయనకు తెలియదా అని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చేశాక ఆయన ఇలా మాట్లాడటం ఏ మాత్రం బాలేదంటూ మండిపడుతున్నారు.