NTR Speech: బేసిగ్గా నేను నవ్వడం మొదలు పెడితే దాన్ని ఆపుకోవడం చాలా కష్టం..హాట్సాఫ్ సిద్ధు:ఎన్టీఆర్

NTR Speech: బేసిగ్గా నేను నవ్వడం మొదలు పెడితే దాన్ని ఆపుకోవడం చాలా  కష్టం..హాట్సాఫ్ సిద్ధు:ఎన్టీఆర్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda),అనుపమ పరమేశ్వర్ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ థ్రిల్లర్ టిల్లు స్క్వేర్(Tillu Square) మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్మురేపుతోంది. రిలీజైన 9 రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది శభాష్ అనిపించుకుంది.దీంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్( ఏప్రిల్ 8న) ఏర్పాటు చేసింది.ఈ చిత్రానికి మల్లిక్ రామ్ (Mallik Ram) దర్శకత్వం వహించాడు.

ఈ టిల్లు స్క్వేర్ ఈవెంట్లో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) మాట్లాడుతూ..:ముందుగా ఈ వేడుకకు విచ్చేసిన తన అభిమానులకు సిద్దు జొన్నలగడ్డ..అదే మన టిల్లు అభిమానులకు నమస్కారాలు తెలియజేస్తూ స్పీచ్ మొదలుపెట్టాడు. 

ఎన్టీఆర్ మాటల్లోనే.." సిద్దు నటించిన చాలా సినిమాలు ఇంతకుముందు చూశాను కానీ ఎప్పుడూ పర్సనల్గా అతన్ని ఇంట్రాక్ట్ అవ్వలేదు.కరోనా తర్వాతే సిద్దుతో పూర్తిగా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది.అతనికి సినిమా అంటే ఒక పిచ్చి..అదే తన లోకం.ఇలా ఉండే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఉంటారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధూ జొన్నలగడ్డ. తనకి సినిమా తప్ప మరొకటి ఏమీ తెలియదు.డీజే టిల్లు సినిమాలోని తన క్యారెక్టర్ ని చూసి..బయట కూడా బేసిగ్గా సిద్దు ఇలాగే ఉంటాడేమో అందరు అనుకోవచ్చు. కానీ,తన పర్సనల్ లైఫ్ లో సిద్దు అలా ఏ మాత్రం ఉండడు.

Also Read: సినిమా చేశాక ఇలా మాట్లాడుతావా.. జగపతిబాబుపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్

తనకు ఎంతసేపు సినిమా, తను చేస్తున్నటువంటి ఆ సినిమాలోని క్యారెక్టర్, తను ఇన్వాల్వ్ అయినటువంటి కథ, ఆ కథకు నేను ఎంతవరకు న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన. ఇలాంటిది చాలా తక్కువ మంది నటీనటులు లేదా టెక్నీషియన్స్ లో ఈ తపనను చూస్తాం. సిద్దు డీజే టిల్లు అనే మూవీతో కేవలం సక్సెస్ ని కాదు..మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక క్యారెక్టర్ ఈ సినిమా ద్వారా మనకి ఇచ్చాడు. చాలా సార్లు అనుకునేవాడిని, నేను చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ బాగా చూసేవాడిని, పాపాయి, హిమాన్ అనే కార్టూన్స్ చూసేవాడిని.ఇలాంటి క్యారెక్టర్లు మన జీవితంలో కేవలం సినిమాల రూపంలో మిగిలిపోతే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని, అలాగే ఈరోజు టిల్లు కేవలం ఒక డీజే కాదు. టిల్లు కేవలం ఒక సిద్దు జొన్నలగడ్డ కాదు, టిల్లు మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు.

ఈ రోజు హాట్సాఫ్ సిద్దు జొన్నలగడ్డ, హ్యాట్సాఫ్ టు డిజె టిల్లు టీం, అండ్ టిల్లు స్క్వేర్ టీం.మన ఇంట్లో ఉండిపోయి మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసినందుకు, మీ అందరికీ హాట్సాఫ్. నవ్వించడం అనేది ఒక వరం నవ్వకపోవడం ఒక శాపం. నాకు బేసిగ్గా నేను నవ్వడం మొదలు పెడితే దాన్ని ఆపుకోవడం చాల కష్టం. నేను అదుర్స్ సినిమా చేస్తున్నప్పుడు వినాయక్ చాలా కష్టపడేవాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనను చూస్తేనే నాకు నవ్వు వచ్చేసేది. అరవింద సమేత షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇదే త్రివిక్రమ్ గారు కూడా ఫేస్ చేశారు అలాంటిది నేనింకా నవ్వలేను బాబోయ్ అనే అంతలా నవ్వించాడు సిద్దు.

నన్నే కాదు చాలామందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్దుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు ఇంకా చాలా అద్భుతమైన క్యారెక్టర్ లని క్రియేట్ చేయాలి. మనందరికీ అందించాలని, భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ గురించి చెప్పను. కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ శాతం ఉంటుంది. కలగనే ధైర్యం ఉండాలి, ఆ ధైర్యాన్ని, ఆ కలని సార్ధకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి అని ఒక డైలాగ్ చెప్పారు.. అది కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి ఇక్కడ మీరు, ఐ యాం టెల్లింగ్ దట్ అంటూ నవ్వులు పూయించారు. అనంతరం పోలే అదిరి పోలే అంటూ త్రివిక్రమ్ ని నవ్వించాడు. దేవర అనే సినిమా లేట్ అయినా మీ అందరూ కాలర్ ఎగరేసుకునేలా అందిస్తామని అంటూ" ఎన్టీఆర్ తన అద్భుత స్పీచ్ని అదరగొట్టేసాడు.