
మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageshwara rao). భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు వంశీ(Vamshee) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అంచనాలు అమాంతం పెంచేశాయి. దీంతో టైగర్ నాగేశ్వర రావు సినిమా కోసం రవితేజ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
INDIA'S BIGGEST THIEF IS READY TO BEGIN HIS HUNT ???
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 16, 2023
TIGER'S INVASION BEGINS TOMORROW AT 3.06 PM ❤️?#TigerNageswaraRao@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla @SrikanthVissa… pic.twitter.com/snG68oLeFE
తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఆగస్టు 17న టైగర్ నాగేశ్వరరావు దండయాత్ర మొదలుకానుంది అంటూ అప్డేట్ ఇచ్చారు. ఈ అప్డేట్ ఆగస్టు 17న మధ్యాహ్నం 3:06 నిమిషాలకు రానుంది. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ చేతిలో గొడ్డలి పట్టుకొని చాలా పవర్ఫుల్ గా కనిపించారు. కానీ రవితేజ పేస్ మాత్రం రివీల్ చేయలేదు మేకర్స్. ఈ పోస్టర్ ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేసింది.
ఇక 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవడ్ బ్యూటీ నుపుర్ సనన్(Nupur saono) హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మురళి శర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.