రూ.2 వేల నోటుతో బ్యాంకుకు వెళ్లండి.. మార్చుకోండి

రూ.2 వేల నోటుతో బ్యాంకుకు వెళ్లండి.. మార్చుకోండి

రూ. 2 వేల నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంకు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.  2023 మే 23 మంగళవారం నుంచి బ్యాంకులతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ  ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2 వేల నోట్లను మార్చుకునే అవకాశాన్ని కలిపించింది. ఈ మేరకు  దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు గైడ్ లైన్స్ విడుదల చేసింది

నోట్లను  మార్చుకునేందుకు  సాధారణ పద్ధతిలోనే  ప్రజలకు  అందించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు ఆర్బీఐ  సూచించింది.  ఇందుకు సంబంధించి ప్రాఫార్మాను విడుదల చేసింది.  బ్యాంకులు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రింకింగ్ వాటర్ సదుపాయాన్ని కల్పించాలని సూచించింది. 

మరోవైపు  రెండు వేల నోటును ప్రవేశపెట్టిన లక్ష్యం నెరవేరిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు.  దేశంలో రెండు వేల నోటు సర్క్యులేషన్ గణనీయంగా తగ్గిందని చెప్పారు.  టాక్స్ కట్టిని వారిపై ఈడీ, సీబీఐ నిఘా ఉంటుదని తెలిపారు.  రూ.2 వేల  రూపాయల కరెన్సీ నోట్లు సెప్టెంబర్ 30 వరకు  చట్టబద్ధంగా కొనసాగుతున్నాయని, దుకాణాలు వాటిని తిరస్కరించలేవని  శక్తికాంతి దాస్ తెలిపారు.  ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు, డినామినేషన్‌ను మార్చుకోవడానికి తగినంత సమయం కేటాయించామని తెలిపారు.  2023 సెప్టెంబర్ 30లోగా రూ.2000 నోట్లను మార్చుకోవాలని వెల్లడించారు.  

https://twitter.com/ANI/status/1660517985549955074?cxt=HHwWhMDR_euTrIsuAAAA

భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2023 మే 19  శుక్రవారం రోజున రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంది.  మే 23 నుంచి ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ  పేర్కొంది. రూ. 2 వేల నోట్లను సర్కూలేషన్‌లో ఉంచొద్దని బ్యాంక్‌లకు ఆదేశించింది. దేశంలో వున్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. 

గత కొద్ది కాలంగా రూ. 2 వేల నోట్లు మార్కెట్లో  సప్లై కావడం లేదు. రూ. 1000 స్థానంలో రూ. 2 వేల నోటును కేంద్రం తీసుకొచ్చింది. 2016లో పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి చెలామణిలో ఉన్న రూ. 2వేల  నోట్లను.. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఉపసంహరించుకున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.