ఆర్బీఐకి ‘బెస్ట్ రిస్క్ మేనేజర్ అవార్డు’

ఆర్బీఐకి ‘బెస్ట్ రిస్క్ మేనేజర్ అవార్డు’

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అరుదైన గౌరవ దక్కింది. లండన్ కు చెందిన సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ 2024ను అందుకుంది. రిస్క్ కల్చర్, అవేర్ నెస్ ను డెవలప్  చేసినందుకు రిజర్వ్ బ్యాంక్ ఉత్తమ రిస్క్ మేనేజర్ గా అవార్డును అందుకుంది. 

ఆర్బీఐ సంస్థ అంతటా కొత్త ఎంటర్ ప్రైజ్ వైడ్ రిస్క్ మేనేజ్ మెంట్ (ERM)  ఫ్రేమ్ వర్క్ ను రూపొందించినందుకు సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2024 లో భాగంగా లండన్ లోని సెంట్రల్ బ్యాంకింగ్ రిస్క్ మేనేజర్ అవార్డుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎంపిక చేసింది. 12వేల కంటే ఎక్కువ సిబ్బందితో ఆర్బీఐ అంత పెద్ద సంస్థలో కొత్త ERM ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడం అంత సులభం కాదని సెంట్రల్ బ్యాంకింగ్ ఓ ప్రకటనలో తెలిపింది. 

ERM అంటే ఏమిటీ? 

ఎంటర్ ప్రైజెస్ రిస్క్ మేనేజ్ మెంట్ (ERM) అనేది దాని మూలధనం , ఆదాయాలపై రిస్క్ హానికరమైన ప్రభావాలను తగ్గించేందుకు సంస్థ కార్యకలాపాలను ప్లాన్ చేయడం, నిర్వహించడం, నిర్దేశించడం, నియంత్రించడం. ఎంటర్ ప్రైజ్ రిస్క్ మేనేజ్ మెంట్ లలో ఫైనాన్షియల్, స్ట్రాటజిక్, ఆపరేషనల్ రిస్క్ లు అలాగే ప్రమాదవశాత్తు నష్టాలకు సంబంధించిన రిస్క్ లు ఉంటాయి. 

ERM అనేది సంస్థ దాని విస్తరించిన నెట్ వర్క్ లలో నష్టాలను నిర్వహించేందుకు , గుర్తించేందుకు రూపొందించబడింది. ERM అనేది సంస్థ నిర్వహణకు సమగ్ర విధానం, దీని అర్థం రిస్క్ ని నిర్వహించే వ్యక్తిగత వ్యాపార యూనిట్లకు బదులుగా కంపెనీ వ్యాప్త విధానానికి ప్రాధాన్యత నివ్వబడుతుంది.