
ముంబై : అన్నదాతకు మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు స్కీంతో పెట్టుబడి సాయం చేస్తుండగా..కేంద్రం పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పడు ఈ రెండు పథకాలతో పాటు.. రైతులకు మరింత మేలు జరగనుంది. ఎలాంటి హామీ అవసరం లేకుండా వ్యవసాయ రుణాన్ని లక్ష నుంచి రూ.1.60లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది RBI.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లిమిట్ పై రివ్యూ నిర్ణయాలను గురువారం ప్రకటించింది RBI. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాల అంశాన్ని ప్రస్తావించింది. ‘ద్రవ్యోల్బణం, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6లక్షల వరకు పెంచుతున్నాం. చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని తెలిపింది RBI.
దీనిపై త్వరలోనే అన్ని బ్యాంకులకు నోటీసు జారీ చేయనుంది. హామీ అవసరం లేకుండా వ్యవసాయ రుణాల పరిమితిని రూ. లక్ష వరకు పెంచుతూ.. 2010లో నిర్ణయం తీసుకుంది RBI. దీన్ని ఇప్పడు లక్ష నుంచి-లక్ష 60 వేల వరకు పొడిగించింది. కనీసం ఎకరం భూమి ఉన్నవారికి ధరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వ్యవసాయ సహాకార బ్యాంకుల్ని(PACS) సంప్రదించవచ్చు.