
ముంబై: మన బ్యాంకింగ్ సిస్టమ్ పటిష్టంగా ఉందని, విదేశాలలోని పరిణామాలను తట్టుకోగలదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. జాక్సన్ హోల్ ఫెడ్‌రిజర్వ్ చైర్మన్ ప్రసంగాన్ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్ సిస్టమ్‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎక్కువ ఫారెక్స్ రిజర్వులను అట్టేపెట్టడం ఈ దిశలోదేనని చెప్పారు. జాక్సన్ హోల్ సమ్మిట్ తర్వాత గత వారం రోజులుగా గ్లోబల్ మార్కెట్లన్నీ భారీగా పడుతున్నాయి. ఈ ఎఫెక్ట్ ఎమర్జింగ్ మార్కెట్లపైనా పడుతోంది. ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల వల్ల మన మార్కెట్లు పటిష్టంగా నిలబడుతున్నాయని దాస్ చెప్పారు.