పనిచేయని అకౌంట్లపై ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

పనిచేయని అకౌంట్లపై ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: గత ఏడాది కాలంగా ఎటువంటి ట్రాన్సాక్షన్లు జరగని అకౌంట్లను రివ్యూ చేయాలని  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. దీంతో పాటు మెచ్యూరిటీ అయ్యాక కూడా విత్‌‌‌‌‌‌‌‌డ్రా కాని లేదా ఎటువంటి రెన్యువల్ మెకానిజం లేని టెర్మ్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్లను కూడా రివ్యూ చేయాలని పేర్కొంది. పనిచేయకుండా ఉన్న అకౌంట్లకు  మినిమమ్ బ్యాలెన్స్ లేదని ఛార్జీలు వేయొద్దని పేర్కొంది. బ్యాంకుల్లో క్లెయిమ్‌‌‌‌‌‌‌‌ చేసుకోకుండా మిగిలిన డిపాజిట్లను తగ్గించేందుకు, ఫ్రాడ్స్‌‌‌‌‌‌‌‌ను అరికట్టేందుకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ చర్యలు చేపడుతోంది. ఇనాపరేటివ్ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఫ్రెష్​ గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను తాజాగా ప్రకటించింది.

తాజా గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ ప్రకారం, సెంట్రల్ బ్యాంక్ రివ్యూ ఉంటుంది. పనిచేయకుండా ఉన్న అకౌంట్లను బ్యాంకులు క్లాసిఫై చేస్తాయి. ఫ్రాడ్స్ జరగకుండా  చూసుకుంటాయి.  అకౌంట్ హోల్డర్లు లేదా వారి నామినీలను గుర్తించడం, క్లెయిమ్స్ సెటిల్ చేయడం,   లేదా అకౌంట్‌‌‌‌‌‌‌‌ను క్లోజ్ చేయడం వంటివి చేపడతాయి. ఈ గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ అన్ని  కమర్షియల్, కో–ఆపరేటివ్ బ్యాంకులకు వర్తిస్తాయి.  ఇవి ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. కాగా, స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ కోసం ఓపెన్ చేసిన లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ అందుకోవడానికి ఓపెన్ చేసిన జీరో బ్యాలెన్స్ అకౌంట్లకు ఈ రూల్స్ వర్తించవు. కొత్త ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌ వర్క్ ప్రకారం, గత ఏడాది కాలంగా ఎటువంటి యాక్టివిటీ లేదనే విషయాన్ని  అకౌంట్ హోల్డర్లకు లెటర్స్‌‌‌‌‌‌‌‌, ఈ–మెయిల్, ఇతర మార్గాల ద్వారా బ్యాంకులు సంప్రదించాల్సి ఉంటుంది.