ఐఐఎఫ్‌‌‌‌ఎల్, జేఎం ఫైనాన్షియల్‌‌‌‌పై స్పెషల్ ఆడిట్‌‌‌‌

ఐఐఎఫ్‌‌‌‌ఎల్, జేఎం ఫైనాన్షియల్‌‌‌‌పై స్పెషల్ ఆడిట్‌‌‌‌

న్యూఢిల్లీ: రెగ్యులేషన్స్‌‌‌‌ ఉల్లంఘించిన ఐఐఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌, జేఎం ఫైనాన్షియల్‌‌‌‌పై దర్యాప్తును ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ పెంచింది.  స్పెషల్ ఆడిట్‌‌‌‌ను జరిపేందుకు ఆడిటర్ల నియామక పక్రియను మొదలు పెట్టింది.  ఇందుకోసం రెండు సపరేట్ టెండర్లను పిలిచింది.  సెబీ   లిస్టులో ఉన్న ఆడిట్ కంపెనీలు ఈ టెండర్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనవచ్చు. వచ్చే నెల 8 లోపు బిడ్స్‌‌‌‌ను సబ్మిట్ చేయాలి.

ఎన్నికైన కంపెనీకి ఏప్రిల్ 12 న పని అప్పజెప్పుతారు. రెగ్యులేషన్స్‌‌ ఉల్లంఘించడంతో గోల్డ్ లోన్లు ఇవ్వకుండా ఐఐఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌పై,  జేఎం ఫైనాన్షియల్‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌లపై ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ  నియంత్రణలు విధించింది.