న్యూఢిల్లీ: వాణిజ్య బ్యాంకులు 2025 ఆర్థిక సంవత్సరంలో అదరగొట్టాయని ఆర్బీఐ తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) రేటు 2.2 శాతానికి పడిపోయింది. ఇది గత కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత కనిష్టం. బ్యాంకింగ్ రంగం పటిష్టమైన బ్యాలెన్స్ షీట్, లాభాలతో నిలకడగా ఉంది.
లోన్ల జారీ, డిపాజిట్ల వృద్ధి రెండంకెల స్థాయిలో కొనసాగుతున్నాయి. అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నికర లాభం 14.8 శాతం పెరిగి రూ.4.01 లక్షల కోట్లుగా నమోదైంది. 2025 సెప్టెంబర్ నాటికి జీఎన్‌పీఏ 2.1 శాతానికి తగ్గిందని ఆర్బీఐ పేర్కొంది.
