అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఇండియా..ఆర్‌‌‌‌బీఐ రిపోర్ట్‌‌

అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఇండియా..ఆర్‌‌‌‌బీఐ రిపోర్ట్‌‌

న్యూఢిల్లీ: గ్లోబల్‌‌గా  అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నా  భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, 2025–26లో  ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా  నిలుస్తుందని  ఆర్‌‌‌‌బీఐ తన నెలవారీ బులెటిన్‌‌లో పేర్కొంది.

బులెటిన్‌‌లోని ముఖ్యాంశాలు..

  • భారత్ సుమారు  50 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోంది. వీటిలో ఈయూ, 6 గల్ఫ్‌‌ కంట్రీస్‌‌ (గల్ఫ్‌‌ కో–ఆపరేషన్ కౌన్సిల్–జీసీసీ), యూఎస్‌‌ కూడా ఉన్నాయి.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 6 నెలలను చూస్తే  ఆర్థిక వ్యవస్థ  బలంగా ఉందని తెలుస్తోంది.  డిసెంబర్‌‌‌‌, 2025లో కన్స్యూమర్ డిమాండ్ ఊపందుకుంది. 
  • రిటైల్ ద్రవ్యోల్బణం  డిసెంబర్‌‌లో స్వల్పంగా పెరిగినా, ఆర్‌‌‌‌బీఐ పెట్టుకున్న లిమిట్‌‌ కంటే తక్కువగానే ఉంది.
  • వ్యాపారాలకు  బ్యాంకులు, నాన్ -బ్యాంకులు ఇచ్చిన లోన్లు పెరిగాయి. 

కేంద్ర ప్రభుత్వం  2025లో పన్ను సంస్కరణలు తీసుకొచ్చింది. జీఎస్‌‌టీని సులభతరం చేసింది.  కార్మిక చట్టాలను అమల్లోకి తెచ్చింది. 
బ్యాంకుల దగ్గర  క్యాపిటల్‌‌ నిల్వలు భారీగా ఉన్నాయి. వీటి అసెట్ క్వాలిటీ మెరుగైంది.  బ్యాంకుల లాభాలు  కూడా స్థిరంగా ఉన్నాయి.  బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా నష్టాలను తట్టుకుని, కనీస స్థాయి  మూలధనాన్ని నిలుపుకోగలవు.