
ఐపీఎల్ 2025 ఫైనల్లో సాల్ట్ అద్భుతమైన క్యాచ్ అందుకొని ఆశ్చర్యపరిచాడు. అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న ఫైనల్ సమరంలో సాల్ట్ బౌండరీ దగ్గర స్టన్నింగ్ క్యాచ్ అందుకొని ఆర్సీబీకి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 5 ఓవర్ చివరి బంతికి ఈ సంఘటన జరిగింది. హేజల్ వుడ్ వేసిన షార్ట్ డెలివరీకి పుల్ షాట్ ఆడాలని చూసిన ప్రియాంష్ ఆర్య మిడ్ వికెట్ మీదుగా ఆడాడు. బంతి దాదాపు సిక్స్ అనుకున్న దశలో డీప్ మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించాడు.
ఈ దశలో బౌండరీ దగ్గర బ్యాలన్స్ తప్పిన సాల్ట్ బంతిని బౌండరీ లైన్ లోపల విసిరి ఆ తర్వాత లైన్ దాటాడు. ఆ తర్వాత బౌండరీ లైన్ నుంచి లోపలి వచ్చి గాల్లోకి ఎగరవేసిన బంతిని అందుకున్నాడు. ఒత్తిడిలో సాల్ట్ తీసుకున్న ఈ క్యాచ్ ఆర్సీబీ జట్టులో విజయాన్ని నింపింది. ప్రియాంష్ ఆర్య ఔట్ కావడంతో పంజాబ్ 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఈ ఓవర్ లో రెండు బౌండరీలు బాది ఊపు మీద కనిపించిన ఆర్య 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ప్రతి ఒక్కరూ కూడా సమిష్టిగా ఆడి జట్టు భారీ స్కోర్ చేయడంలో సహకరించారు. 43 పరుగులు చేసిన కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో కైల్ జెమీసన్, అర్షదీప్ తలో మూడు వికెట్లు పడగొట్టాడు. ఓమార్జాయి, చాహల్, విజయ్ కుమార్ వైశుక్ తలో వికెట్ తీసుకున్నారు.
Brilliant catch by Phil Salt! Sprinting from fine leg, he takes a stunning running catch, nearly crossing the ropes. With incredible awareness, he flicks the ball back into play mid-air, re-enters the field, and completes the catch on the second attempt.
— Get Essentials (@pvprakash) June 3, 2025
pic.twitter.com/DFTN3uZiTk