ఫ్లేఆఫ్స్కి ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బ్యాటర్

ఫ్లేఆఫ్స్కి ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బ్యాటర్

RCB: ఐపీఎల్ 2026 (IPL 2026) లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి, పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కు ఊహించని షాక్ తగిలింది. మే 26న ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే అత్యంత కీలకమైన ‘క్వాలిఫైయర్-1’ పోరుకు ముందు.. ఆ జట్టు స్టార్ ఓపెనర్ జాకబ్ బెథెల్ (Jacob Bethell) గాయం కారణంగా ఉన్నపళంగా స్వదేశానికి (England) తిరిగి వెళ్లిపోయాడు. 

గాయంతో ఇంగ్లాండ్‌కు బెథెల్: 
ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జాకబ్ బెథెల్ ఎడమ చేతి వేలికి తీవ్ర గాయమైంది. జూన్ మొదటి వారంలో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌తో 3 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉండటంతో.. ఈ కీలక సిరీస్ కోసం బెథెల్ ఇంగ్లాండ్ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. దాంతో, గాయం తీవ్రత పెరగకుండా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) మెడికల్ టీమ్ పర్యవేక్షణలో మెరుగైన చికిత్స, వైద్య పరీక్షల కోసం అతడ్ని ఐపీఎల్ వదిలి పెట్టి స్వదేశానికి వెళ్ళిపోయాడు.  

►ALSO READ | పెద్ది డ్యాన్స్ ట్రై చేద్దామా.. ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘పెద్ది’ పోస్టర్లతో ఆసీస్ క్రికెటర్  రచ్చ రచ్చ!

కోహ్లీతో ఫిల్ సాల్ట్ ఓపెనింగ్‌: 
ఈ సీజన్ ఆరంభంలో మరో ఇంగ్లాండ్ స్టార్ ఫిల్ సాల్ట్ గాయపడటంతో జాకబ్ బెథెల్‌కు ఆర్‌సీబీ తుది జట్టులో అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని అందుకుని 7 మ్యాచ్‌ల్లో బెథెల్ అద్భుతంగా రాణించాడు. సాల్ట్ కోలుకుని తిరిగొచ్చినప్పటికీ బెథెల్ ఫామ్ చూసి జట్టు అతడినే ఓపెనర్‌గా కంటిన్యూ చేసింది. కానీ ఇప్పుడు క్వాలిఫైయర్-1 ముంగిట బెథెల్ దూరం కావడంతో.. మే 26న గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీతో కలిసి ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, బెథెల్ స్థానంలో కొత్త ప్లేయర్ ఎవరినీ రీప్లేస్‌మెంట్ చేయడం లేదని ఆర్‌సీబీ తేల్చి చెప్పింది.