RCB Players Mass Dance: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకుంది. ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా ఆర్‌సీబీ రికార్డు సృష్టించింది.
చివరి ఓవర్లలో విరాట్ కోహ్లీ భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించగా, ఆర్‌సీబీ అభిమానులు దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు. మ్యాచ్ ముగిసిన అనంతరం అహ్మదాబాద్‌లోని టీమ్ హోటల్‌కు చేరుకున్న ఆర్‌సీబీ ప్లేయర్స్ భారీగా వేడుకలు జరుపుకున్నారు. కెప్టెన్ రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్యా హోటల్ సిబ్బందితో కలిసి పంజాబీ ధోల్ బీట్స్‌కు అదిరిపోయే డాన్స్ చేశారు.
►ALSO READ | కప్పు కొట్టింది బెంగళూరు.. తెలుగు రాష్ట్రాల్లో RCB ఫ్యాన్స్ ఓవరాక్షన్.. పిచ్చ కొట్టుడు కొట్టిన పోలీసులు
ఆర్‌సీబీ ఆటగాళ్ల డ్యాన్స్ కి సంబంధించిన వీడియోలని బెంగళూరు ఫ్రాంచైజీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వేడుకల్లో కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రాసిఖ్, వెంకటేష్ అయ్యర్‌లు కూడా చేరి కిరాక్ స్టెప్పులేశారు.
Running on vibes, celebrations, and very little sleep. 😮💨🏆❤️ pic.twitter.com/l1v1yi38Os
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026
Celebration rukenge nahi ft. Krunal Pandya. 🕺🤭😂 pic.twitter.com/s6RgvHdxaR
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026
