బెంగుళూర్: డబ్ల్యూపీఎల్-2026 సీజన్ కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ (RCB) యాజమాన్యం ప్రకటించింది. గరిష్టంగా ఐదుగురిని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ.. నలుగురు ఆటగాళ్లనే వచ్చే సీజన్ కోసం అట్టిపెట్టుకుంది. స్టార్ ప్లేయర్ స్మృతి మందనాతో పాటు రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, శ్రేయాంక పాటిల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ నెక్ట్స్ సీజన్ కోసం కొనసాగిస్తోన్న ప్లేయర్లలో మందనా, శ్రేయాంక, దీప్తి ఇండియన్స్ కాగా.. ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా) ఒక్కరే ఫారెన్ ప్లేయర్.
కాగా, 2025 నవంబర్లో వచ్చే సీజన్ కోసం డబ్ల్యూపీఎల్ మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. రిటెన్షన్ లిస్ట్ ప్రకటించడానికి ఫ్రాంచైజ్‌లకు బీసీసీఐ ఇచ్చిన గడువు ముగియడంతో అన్ని యాజమాన్యాలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను గురువారం (నవంబర్ 6) వెల్లడించాయి. ఉమెన్స్ వరల్డ్ కప్ విశ్వవిజేతగా నిలిచిన ఇండియా జట్టులోని చాలా మంది ప్లేయర్లను ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్నాయి. అలాగే.. వరల్డ్ కప్‌లో ఆకట్టుకున్న విదేశీ ప్లేయర్లను కూడా యాజమాన్యాలు రిటైన్ చేసుకున్నాయి.
►ALSO READ | గుజరాత్ బోల్డ్ డెసిషన్: వరల్డ్ కప్ హయ్యెస్ట్ రన్ స్కోరర్‌ను వదిలేసిన ఫ్రాంచైజ్
ఓవరాల్‌గా ఢిల్లీ, ముంబై ఐదుగురిని, బెంగుళూర్ నలుగురిని, గుజరాత్ ఇద్దరిని, యూపీ ఒక్కరి చొప్పున రిటైన్ చేసుకున్నాయి. రిటెన్షన్ పాలసీలో గుజరాత్ నిర్ణయాలు అందరినీ ఆశ్యర్యానికి గురి చేశాయి. వన్డే ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, ఫైనల్‌లో వరుస సెంచరీలతో దుమ్మురేపిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్, సెమీస్‌లో భారత్‌పై శతకంతో చెలరేగిన ఆస్ట్రేలియా ప్లేయర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ ఇద్దరిని రిటైన్ చేసుకోకుండా ఆక్షన్‌కు వదిలేసింది గుజరాత్.
ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్:
- స్మృతి మంధాన 3.5 కోట్లు
- రిచా ఘోష్ 2.75 కోట్లు
- ఎల్లీస్ పెర్రీ 2 కోట్లు
- శ్రేయంక పాటిల్ 60 లక్షలు
