కింగ్ కోహ్లీ మరో సెంచరీ.. ఆర్సీబీ భారీ స్కోరు

కింగ్ కోహ్లీ మరో సెంచరీ.. ఆర్సీబీ భారీ స్కోరు

కీలకమైన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్యాట్స్మన్ రాణించారు. గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్ లో 20 ఓవర్లలో 5 వికెట్లకు 197  పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీతో చెలరేగి జట్టుకు భారీ స్కోరును అందించాడు. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లీ, డూ ప్లెసిస్ మంచి పాట్నర్ షిప్ను అందించారు. తొలి వికెట్కు 67 పరుగులు చేశారు. అయితే 19 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసిన డూ ప్లెసిస్ ను నూర్ అహ్మద్ ఔట్ చేశాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో మాక్స్ వెల్ పెవీలియన్ చేరాడు. అనంతరం లామ్రోర్ 85 పరుగుల వద్ద ఔటయ్యాడు.

కోహ్లీ సూపర్ సెంచరీ...

ఈ సమయంలో జట్టుకు విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. బ్రేస్ వెల్ తో కలిసి 4వ వికెట్ కు 47 పరుగులు జత చేశాడు. ఇదే క్రమంలో 36 బంతుల్లో  హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 26 పరుగులు చేసిన బ్రేస్ వెల్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దినేష్ కార్తీక్..డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో అనూజ్ రావత్(23)తో కలిసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. ఇదే క్రమంలో 61 బంతుల్లో 1 సిక్స్, 13 ఫోర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీసుకోగా..రషీద్ ఖాన్, యశ్ దయల్, షమీ తలో వికెట్ దక్కించుకున్నారు.