RCB vs GT: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరువైదంది. కాసేపట్లో జరిగే భీకర పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ అన్ని విభాగాల్లో దూసుకుపోతాంది. ఇంకోవైపు గుజరాత్ టైటాన్స్ లీగ్ మొదటి హాఫ్‌లో యావరేజ్‌గా ఆడినా.. సెకండ్ హాఫ్‌లో మాత్రం ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఆరింట్లో గెలిచి మస్తు కం బ్యాక్ ఇచ్చింది. రెండు టీమ్‌లలో విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, భువనేశ్వర్ కుమార్, కాగిసో రబాడ వంటి ప్లేయర్లు ఉన్నారు. కానీ నేటి మ్యాచ్ రిజల్ట్‌ను డిసైడ్ చేసే ముగ్గురు ప్లేయర్స్ రికార్డులు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
* కింగ్ కోహ్లి vs రబాడ: రికార్డులు చూస్తే మైండ్ బ్లాకే:
కాసేపట్లో జరిగే మ్యాచ్‌కే అత్యంత క్రేజీ అండ్ హై-ప్రెషర్ బ్యాటిల్ ఏదైనా ఉందంటే అది విరాట్ కోహ్లి వర్సెస్ కాగిసో రబాడ మధ్య ఫైట్ అని చెప్పొచ్చు. ఈ సీజన్ లీగ్ స్టేజ్‌లో కోహ్లి 557 రన్స్ కొట్టి ఆర్‌సీబీ తరఫున అద్భుతమైన ఫామ్‌ని ప్రదర్శించాడు. కానీ రబాడ బౌలింగ్‌లో కోహ్లి ట్రాక్ రికార్డ్ చూస్తే ఫ్యాన్స్‌కు కొంచెం టెన్షన్ పుడుతుంది. ఐపీఎల్ హిస్టరీలో రబాడ వేసిన 16 ఇన్నింగ్స్‌లలో కోహ్లి కేవలం 79 బంతులు ఆడి 111 రన్స్ మాత్రమే చేసిండు.. ఇందులో ఏకంగా ఐదు సార్లు రబాడ చేతిలో అవుటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో కోహ్లి కేవలం 3 సిక్సర్లు, 13 ఫోర్లు మాత్రమే కొట్టగలిగాడు. మరి ఇవాళ రాత్రి ఈ ఇద్దరి మధ్య అధిపత్యం ఎవరిదో చూడాలి.
ALSO READ : RCB vs GT మధ్య హైవోల్టేజ్ పోరు..
* శుభ్‌మన్ గిల్ vs భువనేశ్వర్: గుజరాత్‌కు గండమేనా?:
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గీ సీజన్ లీగ్ స్టేజ్‌లోనే ఏకంగా 600కు పైగా పరుగులు కొట్టి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు. గిప్పుడు క్వాలిఫైయర్ 1లో కూడా అదే రేంజ్‌లో దంచకొట్టాలని చూస్తున్నాడు. కానీ ఆర్‌సీబీ మెయిన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అంటే గిల్‌కు అస్సలు పడటం లేదు.. భువి వేసిన 13 ఇన్నింగ్స్‌లలో గిల్ 75 బాల్స్ ఆడి జస్ట్ 80 రన్స్ మాత్రమే చేయగలిగాడు. పైగా 5 సార్లు భువి బౌలింగ్‌లో పెవిలియన్ దారి పట్టాడు. ఈ రికార్డు చూస్తుంటే భువి స్వింగ్ దెబ్బకు గిల్‌కు గండం పొంచి ఉన్నట్టే కనపడుతుంది.
* విరాట్ కోహ్లి vs రషీద్ ఖాన్: స్పిన్ మాయజాలం:
విరాట్ కోహ్లి, రషీద్ ఖాన్ మధ్య జరిగే స్పిన్ వార్ కూడా మ్యాచ్‌కే హైలైట్ కానుంది. రషీద్ వేసిన 11 ఇన్నింగ్స్‌లలో కోహ్లి 95 బంతులు ఎదుర్కొని 134.73 స్ట్రైక్ రేట్‌తో 128 రన్స్ కొట్టి రషీద్‌ను గట్టిగానే టార్గెట్ చేశాడు. అయితే రషీద్ ఖాన్ కూడా తక్కువోడేం కాదు.. కోహ్లిని మూడు సార్లు బురిడీ కొట్టించి అవుట్ చేశాడు. మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను మలుపు తిప్పే గీ బ్యాటిల్‌లో కింగ్ నెగ్గుతాడా లేక రషీద్ మ్యాజిక్ చేస్తాడా అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఓవరాల్‌గా ఈ 3 ఫైట్స్ కాసపట్లో జరగబోయే మ్యాచ్‌ను పీక్స్‌కి తీసుకెళ్లడం ఖాయంగా కానోస్తుంది.
