RCB vs GT మధ్య హైవోల్టేజ్ పోరు.. హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ ఇదే! 

RCB vs GT మధ్య హైవోల్టేజ్ పోరు.. హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ ఇదే! 

RCB vs GT: ఐపీఎల్ 2026 ఫైట్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఇవాళ ధర్మశాల వేదికగా జరిగే క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో టేబుల్ టాపర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు ఫైనల్ బెర్త్ కోసం కుస్తీ పట్టబోతున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 8 సార్లు పోటీ పడ్డాయి.  

హెడ్ టు హెడ్ రికార్డులు: 
గుజరాత్ టైటాన్స్ జట్టు 2022లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గీ రెండు జట్ల మధ్య పంచాయితీ మస్తు రసవత్తరంగా కొనసాగుతాంది. ఒకరిపై ఒకరు గెలవడానికి ఇరు జట్లు కొట్లాడినాయి. గత రికార్డులని ఒకసారి చూస్తే ఈ రెండు టీమ్‌ల బలాబలాలు మస్తు క్రాక్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో ఆర్‌సీబీ 4 గెలిస్తే, గుజరాత్ కూడా 4 మ్యాచ్‌లలోనే విజయం సాధించడం విశేషం. ఆర్‌సీబీ టీమ్ బ్యాటింగ్ డెప్త్‌తో అగ్రెసివ్‌గా దూసుకుపోతుంటే.. గుజరాత్ మాత్రం పక్కా ప్లానింగ్‌తో బౌలింగ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ కంట్రోల్డ్‌గా ఆడుతుంది. కాగా ఇవాళ ధర్మశాలలో ఆర్‌సీబీ అగ్రెసివ్ బ్యాటింగ్‌కు, గుజరాత్ కంట్రోల్డ్ బౌలింగ్‌కు మధ్య అస్సలైన యుద్ధం జరగబోతుంది.  

ALSO READ : RCBని టెన్షన్ పెడుతున్న కింగ్ కోహ్లి 'ప్లేఆఫ్స్ రికార్డ్స్..

పిచ్ రిపోర్ట్:  
ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియం పిచ్ సాధారణంగా ఫాస్ట్ అవుట్‌ఫీల్డ్, మంచి బౌన్స్‌తో బ్యాటింగ్‌కు మస్తు అనుకూలిస్తది. కానీ, ఫ్లడ్‌లైట్ల వెలుతురులో కొత్త బంతితో పేస్ బౌలర్లు మొదట్లో కొంచెం స్వింగ్ చేసి వికెట్లు పడగొట్టే ఛాన్స్ కూడా ఉంది. వాతావరణం అయితే క్లియర్‌గానే ఉండేటట్టు కనిపిస్తుంది కానీ.. రాత్రి గడిచేకొద్దీ మంచు (Dew) ప్రభావం చూపే అవకాశం గట్టిగా ఉంది. ఇది సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసేటోళ్లకు కొంచెం తిప్పలు పెట్టే ముచ్చటే. ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఇటు బ్యాట్‌కు, అటు బౌలింగ్ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది.