
చావో రేవో మ్యాచుకు బెంగుళూరు, రాజస్తాన్ సిద్ధమయ్యాయి. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన బెంగుళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. మరోవైపు పాయిట్ల పట్టికలో ఇరు జట్లు 6 పరాజయాలతో ఉన్నాయి. మరో మ్యాచ్లో ఓడిపోతే మాత్రం రెండు జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారనున్నాయి.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు; డు ప్లెసిస్ (కెప్టెన్), కోహ్లీ, మ్యాక్స్ వెల్, అనుజ్ రావత్, లొమ్రోర్, దినేశ్ కార్తీక్, బ్రేస్ వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, సిరాజ్
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు: బట్లర్, జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, హెట్ మేయర్, అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, ఆసిఫ్, చాహల్