హైబీపీ బాధితుల కోసం ఆర్​డీఎన్​ చికిత్స

హైబీపీ బాధితుల కోసం ఆర్​డీఎన్​ చికిత్స

హైదరాబాద్​, వెలుగు :  అధిక రక్తపోటు చికిత్స కోసం మెడ్‌‌‌‌ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్  సింప్లిసిటీ స్పైరల్‌‌‌‌ రీనల్ డినర్వేషన్ సిస్టమ్ (ఆర్​డీఎన్​)ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అధిక రక్తపోటుతో దెబ్బతినే కిడ్నీ సమీపంలోని నరాలకు ఇది చికిత్స చేస్తుంది.  ఈ విధానంలో రోగికి మత్తుమందు ఇచ్చిన తర్వాత,  మూత్రపిండాలకు దారితీసే ధమనిలోకి చాలా సన్నని గొట్టాన్ని (కాథెటర్) చొప్పిస్తారు. మూత్రపిండాల్లో నరాల కార్యకలాపాలను ఇది నియంత్రిస్తుంది.   ఆర్​డీఎన్ అనేది మినిమల్లీ ఇన్వేసివ్  థెరపీ.   అంటే శరీరానికి చిన్న గాటు పెడతారు. దీని ద్వారానే కాథెటర్​ను లోపలికి పంపుతారు.