
మేడ్చల్, వెలుగు: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడలో ఓ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలింది. మంగళవారం మధ్యాహ్నం ఆల్కలైడ్స్ బయో యాక్టివ్స్ ఫార్మా కంపెనీలో ఈ ఘటన జరిగింది.
బాయిలర్ పేలడంతో గన్నారం శ్రీనివాస్ రెడ్డి(బాయిలర్ ఆపరేటర్)కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని తోటి కార్మికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఏఐజీ హాస్పిటల్కు తీసుకెళ్లినట్లు మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.