
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సహా అన్ని పెండింగ్ అంశాలు, సమస్యలపై భారత్‌తో సమగ్ర చర్చలు జరపడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. అందుకు ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన వేదిక అవసరమని తెలిపారు.
శుక్రవారం (ఆగస్టు 22) ఇషాక్ దార్ ఇస్లామాబాద్‌లోని పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. "పాకిస్తాన్ ఎల్లప్పుడూ సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉంటుంది. ఏకపక్ష ఎజెండా, ఏ ఒక్క పాయింట్‌పై చర్చలు జరపడం మాకు ఆమోదయోగ్యం కాదు" అని ఇషాక్ దార్ వెల్లడించారు.