
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘గట్ట కుస్తీ’. తెలుగులో ‘మట్టి కుస్తీ’గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మూడేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో మంచి రెస్పాన్స్ రావడంతో.. దీనికి సీక్వెల్‌ను స్టార్ట్ చేశారు. ‘గట్ట కుస్తీ 2’ టైటిల్‌తో మంగళవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
చెల్లా అయ్యావు దర్శకత్వంలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డాక్టర్ ఇషారి కె గణేష్, విష్ణు విశాల్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఫస్ట్ పార్ట్‌లో నటించిన కరుణాస్, మునీష్కాంత్, కాళీ వెంకట్ ఇందులోనూ కొనసాగుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ ఐకానిక్ స్టిల్‌కు విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ పోజు ఇవ్వడం ఆకట్టుకుంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని మేకర్స్ తెలియజేశారు.