నిద్రమత్తు ఎంతపని చేసింది.. డివైడర్ను ఢీ కొట్టి.. ORRపై నుంచి కిందపడిన రెడీమిక్స్ లారీ !

నిద్రమత్తు ఎంతపని చేసింది.. డివైడర్ను ఢీ కొట్టి.. ORRపై నుంచి కిందపడిన రెడీమిక్స్ లారీ !

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోకాపేట్ నియో పోలీస్ ఔటర్ రింగు రోడ్డుపై రెడీమిక్స్ లారీ బీభత్సం సృష్టించింది. డివైడర్ను ఢీ కొట్టి అదుపు తప్పి ఔటర్పై నుంచి రెడీమిక్స్ కాంక్రీట్ లారీ కిందపడింది. సర్వీస్ రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

విజయవాడ, బెంగళూరు, ముంబై, నాగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవేలకు కనెక్టివిటీగా 156.9 కిలోమీటర్ల పరిధిలో ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. దీని‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రోజూ సగటున 1.44 లక్షల వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. హైవేలకు ఔటర్ కనెక్టివిటీ ఉండటంతో దూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు ఔటర్ను ఎంచుకుంటున్నారు. రోడ్డు విశాలంగా ఉండటంతో హైస్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దూసుకెళ్తున్నారు. దీంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 

వీకెండ్స్లో యూత్ ఓఆర్ఆర్పై ఎంజాయ్ ట్రిప్స్ వేస్తున్నారు. పార్టీలలో ఎంజాయ్ చేసొచ్చి ఔటర్పై చక్కర్లు కొడుతున్నారు. డ్రంకన్ డ్రైవ్ చేస్తూ, ఓవర్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. ప్రమాదాలకు గురవుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకునేటోళ్లు ఔటర్ పైనే ట్రయల్స్ వేస్తున్నారు. రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ రూల్స్, సైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులను ఫాలో కాకుండా ప్రమాదాల బారినపడుతున్నారు. వీరిలో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటుండటం గమనార్హం.