-
హరీశ్‌రావు ఎక్కడి రమ్మంటారో చెప్పండి
-
రైతాంగాన్ని కన్ఫ్యూజన్ చేయకండి
-
కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
హైదరాబాద్: రైతు రుణమాఫీ గురించి మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్కడికి చర్చకు వస్తారో రండి.. అందుకు తామే సిద్ధమే అని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్హయాంలోరైతులకు చేసింది ఏంటని ప్రశ్నించారు. 8 నెలల్లో రేవంత్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటో డేటా తీసుకువస్తామని సవాల్ విసిరారు. 2018–-24 వరకు వ్యవసాయేతర భూములకు రైతుబంధు రూ.25,676 కోట్లు ఇచ్చారని.. అందులో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు అందాయని ఆరోపించారు. గాంధీభవన్‌లో కోదండరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ఔటర్ రింగ్ రోడ్డులో భూమి కోల్పోతే నష్టపరిహారం ఇచ్చారు. మొన్నటి వరకు కూడా రైతు బంధు వచ్చింది. మీ ప్రభుత్వం మాదిరి నాలుగు గోడల మధ్య కూర్చొని నిర్ణయాలు తీసుకోం. రైతులకు రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే.. ఆ పైన ఉన్న మొత్తం చెల్లిస్తే..రూ 2 లక్షలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది.
రైతాంగాన్ని అనవసరంగా బీఆర్ఎస్ నేతలు కన్ఫ్యూజన్ చేయకండి. ధరణితో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మీ పాలనలో రైతులు కోలుకోలేని రీతిలో అప్పుల పాలయ్యారు. మీ వద్ద రుణమాఫీ కానీ రైతుల జాబితా ఉంటే ప్రభుత్వానికి పంపండి. కానీ గాలి మాటలు మాట్లాడకండి. మీరు ధరణితో చేసిన తప్పులు ఆర్వోఆర్ చట్టం అమలుతో బయటపడతాయి’అని తెలిపారు.
