V6 News

రియల్ ఎస్టేట్ వ్యాపారి సూసైడ్

రియల్ ఎస్టేట్ వ్యాపారి సూసైడ్

మల్కాజిగిరి, వెలుగు: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్​వ్యాపారి సూసైడ్ చేసుకున్నాడు. సీఐ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్ పురిలోని ఆర్కే ఎన్​క్లేవ్, వాల్వార్​నగర్‎కు చెందిన శ్రవణ్​కుమార్​రియల్​ఎస్టేట్​వ్యాపారం చేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు.  పని ముగించుకొని సోమవారం రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి, తన గదిలోకి వెళ్లాడు.

 11 గంటలకు అతని సోదరుడు కిరణ్ కుమార్ వెళ్లి పిలవగా డోర్​ తీయలేదు. దీంతో కుటుంబసభ్యులతో కలిసి తలుపు పగులగొట్టి చూడగా ఫ్యాన్​కు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబసభ్యలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.