హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి తారిక్ అలీ అలియాస్ బాబా ఖాన్(40) ను హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఇంటి బయట కూర్చున్న వ్యక్తి ని తల్వార్లతో నరికారు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు బాబా ఖాన్. 

ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్ర నగర్ లో ఈ ఘటన జరిగింది. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని చెప్పారు.