సాయి దుర్గ తేజ్ ‘సంబరాల యేటిగట్టు’ అప్డేట్.. సంబరాలకు ఇంకాస్త సమయం

సాయి దుర్గ తేజ్ ‘సంబరాల యేటిగట్టు’ అప్డేట్.. సంబరాలకు ఇంకాస్త సమయం

సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్‌‌‌‌ ఇండియా యాక్షన్ డ్రామా ‘సంబరాల యేటిగట్టు’.  రోహిత్ కేపీ దర్శకత్వంలో  కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి తేజ్ కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్‌‌‌‌కు సంబంధించి కీలక అప్‌‌‌‌డేట్ ఇచ్చారు నిర్మాతలు. వాస్తవానికి ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేయగా, ఇప్పుడు విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

దీనికి గల కారణాలను వివరిస్తూ  ఓ నోట్‌‌‌‌ను  విడుదల చేశారు. ‘‘సంబరాల యేటిగట్టు’ చిత్రాన్ని  అత్యంత ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున రూపొందిస్తున్నాం. పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ కథాకథనాలతో వరల్డ్ క్లాస్ టెక్నికల్  స్టాండర్డ్స్‌‌‌‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం.

ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన సమ్మెతో పాటు కొన్ని కీలక సీజీ  పనుల కారణంగా సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం. సాయి దుర్గ తేజ్ చాలా డెడికేటెడ్‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. తన క్యారెక్టర్ కోసం బాగా కష్టపడుతున్నారు. అలాగే దర్శకుడు రోహిత్ కొన్నేళ్లుగా  ప్యాషనేట్‌‌‌‌గా పని చేస్తున్నారు. అందరి సమిష్టి  కృషితో ఆడియెన్స్కు బెస్ట్ అవుట్‌‌‌‌పుట్ ఇచ్చేందుకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేస్తాం ’ అని నోట్ విడుదల చేశారు.  ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బి అజనీష్ లోక్‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.