టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి 38 ఏళ్ల వయసులో ఛాతిలో నొప్పి కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో శుక్రవారం (అక్టోబర్ 4, 2024) ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. ఇటీవల సీఐడీ శకుంతల కూడా ఛాతి నొప్పితో ఆసుపత్రితో చేరి చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కూడా ఛాతి నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ 48 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. 2023లో భద్రాచలంకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే హఠాన్మరణం పాలయ్యారు. ఇలా.. ఛాతి నొప్పి ఇటీవల ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న క్రమంలో.. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకుందాం..
కొందరు ఛాతిలో నొప్పి వస్తుంటే ‘హార్ట్ ప్రాబ్లమ్ ఏమో’ అని భయపడుతుంటారు. కానీ, ప్రతీ ఛాతి నొప్పి హార్ట్ ఎటాక్ లక్షణం కాదు. కొన్నిసార్లు గ్యాస్ ట్రబుల్ వల్ల కూడా ఛాతిలో నొప్పి వస్తుంది. అలాగని ఛాతి నొప్పిని మామూలుగా తీసుకోవద్దు. ఎసిడిటీ పెరిగినప్పుడు ఇలా అవుతుంది. తిన్న తరువాత, ఫాస్టింగ్ చేసిన తరువాత లేదా మసాలా ఫుడ్ తిన్నాక వస్తే అది గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఈ నొప్పి యాంటాసిడ్స్ వాడితే తగ్గుతుంది.
అదే హార్ట్ ప్రాబ్లమ్ అయితే నడిచినా, బరువులు ఎత్తినా, మెట్లు ఎక్కుతున్నా, జాగింగ్ చేస్తున్నా ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది. ఆ నొప్పి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందంటే దాన్ని హార్ట్ ప్రాబ్లమ్ అనుకోవాలి. అంతేకాకుండా చెమటలు విపరీతంగా పట్టడం... వికారంగా అనిపించడం.. ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్‌గానే గుర్తించాలి.
ALSO READ | రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మృతి.. సంతాపం తెలిపిన ఎన్టీఆర్
కార్డియాక్ అరెస్ట్‌లో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కానీ, గుండెకు బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. దాంతో గుండె కొట్టుకోవడం ఆగిపోయి ఒక్కసారిగా కిందపడిపోతారు. ఇలా కాకుండా ఉన్నట్టుండి ఛాతిలో నొప్పిగా ఉండి, గుండె బరువుగా అనిపిస్తే దాన్ని హార్ట్ ఎటాక్ అంటారు. కొందరిలో హార్ట్ ఎటాక్ ... కార్డియాక్ అరెస్ట్‌గా మారే అవకాశం ఉంది. ఎక్సర్‌సైజ్‌లు చేసేటప్పుడు మరీ బరువులు ఎత్తేవి చేయొద్దు.
బరువులు ఎత్తడం వల్ల కూడా గుండె మీద ఒత్తిడి పడుతుంది. మానసికంగా ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. బీపీ, షుగర్‌లను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. బరువు పెరగడానికైనా, తగ్గడానికైనా ఎలాంటి సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ వాడకూడదు. వాటివల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అతిగా కాకుండా మితంగా తినాలి. రోజూ ఒక అరగంట ఎక్సర్‌సైజ్, మెడిటేషన్ చేయడం అవసరం.