V6 News

ఏడాది కాలంగా డీలిమిటేషన్ పై చంద్రబాబు మౌనం ఎందుకు...? మిగతా రాష్ట్రాల సీఎంల పోరాటం...

ఏడాది కాలంగా డీలిమిటేషన్ పై చంద్రబాబు మౌనం ఎందుకు...? మిగతా రాష్ట్రాల సీఎంల పోరాటం...

కేంద్రంలో చక్రం తిప్పగలిగే స్థితిలో ఉన్న చంద్రబాబు.. డీలిమిటేషన్​పై మౌన ముద్ర దాలిస్తే, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ సీఎంలు రేవంత్, స్టాలిన్, సిద్ధరామయ్య, విజయన్​ మాత్రం ఏడాది కాలంగా దక్షిణాది రాష్ట్రాల గొంతుక వినిపిస్తున్నారు. జనాభా ప్రతి పాదకన డీలిమిటేషన్​ చేపడితే, కేంద్రంలో సౌత్​స్టేట్స్​ ప్రాతినిధ్యం ఎలా తగ్గిపోతుందో గణాంకా లతో సహా వివరిస్తూ వచ్చారు. గతేడాది మార్చి 22న  ‘‘జాతీయ స్థాయి ప్రతిఘటన.. భారీ ఉద్య మం’’ తప్పదంటూ కేంద్రానికి స్ట్రాంగ్​వార్నింగ్​ఇచ్చారు. ఇక డీలిమిటేషన్​ బిల్లును పార్లమెంట్​లో ఆమోదించడానికి సరిగ్గా 24 గంటల ముందు స్టాలిన్ ఒక వీడియో మెసేజ్ రిలీజ్​ చేశారు. 

‘ఒక వేళ కేంద్రం జనాభా ఆధారంగా లోక్​సభ సీట్లను పెంచాలని చూస్తే మా కుటుంబాలన్నీ వీధు ల్లోకి వస్తాయి.. బ్లాక్ ఫ్లాగ్ ఉద్యమం చేస్తాం..  ఇది ఫైనల్ వార్నింగ్’  అంటూ హెచ్చరిక జారీ చేశారు. అంతకు 24 గంటల ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ ను తెరపైకి తెచ్చారు. అదనంగా పెంచబోయే సీట్లలో 50% ప్రో-రేటా ప్రకారం, మరో 50% సీట్లు జీఎస్​డీపీ ప్రకారం పెంచాలని డిమాండ్​ చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికనే సీట్లను పెంచితే  అది‘‘దీర్ఘకాలిక విపత్తు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ఈమేరకు దక్షిణాది సీఎంలందరికీ ఆయన లేఖలు రాశారు. 

మిగతా సీఎంలు గొంతుచించుకుంటున్నా..

జనాభా ప్రాతిపదికన చేపట్టే డీలిమిటేషన్​కు వ్యతిరేకంగా మిగతా సీఎంలు గొంతుచించుకుంటున్నా, బాబు మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు. ప్రతి జంటా ముగ్గురు పిల్లల్ని కనాలన్న చంద్రబాబు పిలుపుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు జనాభాను నియం త్రించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన సౌత్​స్టేట్స్.. దేశానికి ఆర్థిక దన్నుగా నిలుస్తున్నాయని, తీరా బాబు జనాభాను పెంచాలనుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని, ఇది తిరోగమన చర్య తప్ప మరోటి కాదని పలువురు మండిపడ్డారు. 

ఈ క్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్​షర్మిల చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. మోదీ భయంతోనే చంద్రబాబు, పవన్​ కల్యాణ్​ డీలిమిటేషన్​ను వ్యతిరేకించకుండా దక్షిణాది ప్రయోజనాలను ఫణంగా పెట్టారని ఫైర్​అయ్యారు. వీరి చర్యల వల్ల డీలిమిటేషన్​పై పోరాటంలో ఏపీ ఒంటరిగా మిగిలిపోయిందని వాపోయారు. గత  బుధవారం బాబుకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. 

డీలిమిటేషన్ బిల్లును బహిరంగంగా వ్యతిరేకించాలని, ఏపీకి చెందిన 25 లోక్‌‌‌‌సభ ,11 రాజ్యసభ ఎంపీలందరినీ ఏకం చేసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయించాలని డిమాండ్​చేశారు. ఈమేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలని సూచించినా బాబు నుంచి గానీ, పవన్​ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.