బెంగళూరుకు నీటి కష్టాలెందుకు..?

బెంగళూరుకు నీటి కష్టాలెందుకు..?

బెంగళూరులో నీటి ఎద్దడి, ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నీటి వినియోగం మీద ఆంక్షలు విధించింది అంటే రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏ రేంజ్ లో ఉందొ అర్థం అవుతుంది. స్నానానికి బదులు మొహాన్ని వైప్స్ తో తుడుచుకొని అడ్జస్ట్ అవ్వండి. తినడానికి డిస్పీజబుల్ ప్లేట్స్ ని మాత్రమే వాడండి, వంట సమన్లు ఎక్కువగా కడగకండి, కారు కడగకండి అంటూ పలు ఆంక్షలు విధించింది. వేసవి ప్రారంభంలోనే ఈ రేంజ్ లో ఉంటే ఇంక ఏప్రిల్, మే నెలల్లో నీటి కష్టాల ఏ రేంజ్ లో ఉంటాయో అని బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు. మాములుగా 1000లీటర్ల వాటర్ ట్యాంక్ నీటి ధర 600 నుండి 800ఉండగా, ఇప్పుడు 2000డిమాండ్ చేస్తున్నారట.అసలు బెంగళూరు నీటి కష్టాలకు కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బెంగళూరు నీటి కష్టాలకు ప్రధాన కారణం తక్కువ వర్షపాతం నమోదవ్వటమే అని చెప్పాలి. దీనివల్ల కావేరి నదిలో నీటి మట్టం తగ్గి, సాగునీటి, తాగునీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తింది. అంతే కాకుండా భగర్బజలాలు కూడా ఇంకిపోవటంతో సమస్య తీవ్రమైంది. నీటి కష్టాల గురించి కర్ణాటక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ మాట్లాడుతూ బెంగళూరు వ్యాప్తంగా ఉన్న 14,781 బోర్లలో 6997బోర్లు ఎండిపోయాయని అన్నారు.

కావేరి బేసిన్ రిజర్వాయర్లతో సహా హరాంగి, హేమావతి, కేఆర్ఎస్, కాబిని, రిజర్వాయర్లలో నీటి మట్టం 39శాతానికి పోయిందని, ఫిబ్రవరి 28నాటికి 44.65 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, గతేడాది ఈ సమయానికి 64.61 టీఎంసీలు ఉండేదని అధికారులు. బెంగళూరు నీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే ప్రైవేట్ బోర్ వేల్స్ వినియోగించటం, మిల్క్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయటం వంటి ప్రత్యామ్న్యాయాలపై దృష్టి పెట్టమని శివకుమార్ తెలిపారు.