గురునానక్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి.. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ

గురునానక్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి.. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ

ఇబ్రహీంపట్నం/ఖైరతాబాద్, వెలుగు: స్టూడెంట్ల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్ విద్యా సంస్థల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ డిమాండ్ ​చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించగా  ఝాన్సీ పాల్గొని మాట్లాడారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 4 వేల మంది స్టూడెంట్ల అడ్మిషన్లు తీసుకొని వారిని మోసం చేసిన గురునానక్​ విద్యాసంసంస్థల గుర్తింపును వెంటనే రద్దు చేయాలన్నారు. బాధిత స్టూడెంట్లకు వెంటనే న్యాయం చేయాలని ఆమె డిమాండ్​ చేశారు. న్యాయం కోరుతూ నిరసనలు తెలిపిన విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు.  

ALSO READ:ఆప్టియోను $4.6 బిలియన్లకు కొనుగోలు చేసిన IBM

కార్యక్రమంలో ఏబీవీపీ హైదరాబాద్ సెక్రటరీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అయితే, వీరంతా గురునానక్​కాలేజ్ వద్ద నిరసన తెలుపుతారనే అనుమానంతో పోలీసులు ముందస్తుగా వారిని అరెస్ట్​చేసి పహడీ షరీఫ్​పీఎస్​కు తరలించారు. అనుమతులు లేని వర్సిటీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆయన మాట్లాడుతూ.. గురునానక్, శ్రీనిధి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని లేకపోతే  విద్యాశాఖ ఆఫీసులు, మంత్రుల ఇండ్లను  ముట్టడిస్తామని హెచ్చరించారు.