రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'స్పిరిట్'. ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరాయి. అయితే లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఒకటి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ హైవోల్టేజ్ యాక్షన్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
భారీ డీల్‌కు డిజిటల్ హక్కులు
ప్రభాస్ 'స్పిరిట్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఊహించని ధరకు అమ్ముడుపోయినట్లు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఓటీటీ హక్కులు ఏకంగా రూ. 150 కోట్లు చెల్లించి ఓ ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుందని సమాచారం. ఈ భారీ డీల్ తోనే సినిమా మొత్తం బడ్జెట్ లో దాదాపు సగం కేవలం డిజిటల్ హక్కుల ద్వారానే రికవరీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ ఓటీటీ ప్లాట్ ఫ్లామ్ ఈ సినిమాను భారీ డీల్ కు సొంతం చేసుకుందో అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ భారీ డీల్ గాని నీజమైతే మాత్రం... తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక ఓటీటీ డీల్స్ లో ఒకటిగా నిలవనుంది.
ప్రభాస్ ఇంటెన్స్ కాప్ అవతారం
'స్పిరిట్' సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రభాస్‌తో పాటు పలువురు జూనియర్ ఆర్టిస్టులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగ మార్క్ ఇంటెన్స్, ఫైర్ బ్రాండ్ క్యారెక్టరైజేషన్‌తో ప్రభాస్ పాత్ర మరింత రౌద్రంగా, తీవ్రంగా ఉండబోతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
ప్రభాస్‌కు జోడీగా, 'యానిమల్' బ్లాక్‌బస్టర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి త్రిప్తి డిమ్రిని ఎంపిక చేశారు. ప్రభాస్-త్రిప్తిల ఫ్రెష్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు. వీరితో పాటు, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' , 'యానిమల్' వంటి విజయాల తర్వాత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నుంచి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో 'స్పిరిట్'పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ట్యూన్స్ సమకూరుస్తున్నారు. ఆయన సంగీతం 'యానిమల్'కు మేజర్ హైలైట్‌గా నిలిచింది. కాబట్టి, 'స్పిరిట్'లో కూడా అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలను ఉంటుంది. ఓటీటీ డీల్ తో అదరగొట్టి స్పిరిట్ .. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
